ఏఐపై అధ్యాపకులకు శిక్షణ
ABN , Publish Date - Mar 01 , 2026 | 07:08 AM
రాష్ట్రంలోని డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలల అధ్యాపకులకు ‘కృత్రిమ మేధస్సు(ఏఐ) క్రమశిక్షణ-నిర్ధిష్ట అనువర్తనాలు’ అంశంపై 5 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు...
అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలల అధ్యాపకులకు ‘కృత్రిమ మేధస్సు(ఏఐ) క్రమశిక్షణ-నిర్ధిష్ట అనువర్తనాలు’ అంశంపై 5 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి.తిరుపతిరావు తెలిపారు. మార్చి 2 నుంచి 6 వరకు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో శిక్షణ తరగతులు జరుగుతాయని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ విద్యా కార్యక్రమం, వికసిత్ భారత్-2047 దార్శనికతకు అనుగుణంగా విభిన్న విద్యా విభాగాలలోని అధ్యాపకులకు ఏఐపై స్పష్టమైన, ఆచరణాత్మక అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ఒక ఏఐ చాంపియన్‌ని తయారు చేయడం కూడా ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన అధ్యాపకులు మాస్టర్ ట్రైనర్లుగా టీవోటీ మోడల్ కింద మిగిలిన అధ్యాపకులకు శిక్షణ ఇస్తారన్నారు.