Share News

ఏఐ సాంకేతికతతో పుష్కరాలకు భద్రత: డీజీపీ

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:09 AM

రానున్న గోదావరి పుష్కరాలకు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టుంగా చేసే క్రమంలో కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను వినియోగిస్తామని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.

ఏఐ సాంకేతికతతో పుష్కరాలకు భద్రత: డీజీపీ

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): రానున్న గోదావరి పుష్కరాలకు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టుంగా చేసే క్రమంలో కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను వినియోగిస్తామని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆదివారం పుష్కర ఏర్పాట్లపై సమీక్షించారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పని చేసి, అవాంఛనీయ సంఘనలకు తావు లేకుండా విజయవంతం చేయాలన్నారు. పుష్కర జాయింట్‌ యాక్షన్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రయాగరాజ్‌ కుంభమేళాను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి, తదనుగుణంగా ప్రణాళిక తయా రు చేయాలన్నారు. ఘాట్లలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి క్యూలైన్ల నిర్వహణకు టీటీడీ అధికారులతో చర్చించాలన్నారు. అన్ని ఘాట్లకు సమప్రాధాన్యం ఇస్తూ సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 05:09 AM