సాంకేతిక రంగంలో ఏఐ పాత్ర కీలకం
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:58 PM
సాంకేతిక రంగంలో ఏఐ పాత్ర చాలా కీలకం గా మారిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అయ్యప్ప అన్నారు.
ఆదోని అగ్రికల్చర్, జూన 22(ఆంధ్రజ్యోతి): సాంకేతిక రంగంలో ఏఐ పాత్ర చాలా కీలకం గా మారిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అయ్యప్ప అన్నారు. సోమవారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స కళాశాల విద్యార్థులకు ఎలక్ర్టానిక్స్ విభాగంలోని క్వాంటం ఇన్సోవేషన ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సుపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ అయ్యప్ప మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స ద్వారా విద్యార్థులు సృజనాత్మ క వినూత్న ఆలోచనలను పెంపొందించుకోవచ్చన్నారు. సాంకేతిక జ్ఞానంతో ముం దుకు వెళ్లాలని సూచించారు. ఏఐ ఇన్సోవేటివ్ ఛాలెంజ్ 2026 పోటీల్లో భాగంగా ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యుగంధర్, క్వాంటం ఇన్నోవేషన సె ల్ కోఆర్డినేటర్ ఎలక్ర్టానిక్, విభాగాధిపతి వన్నూర్, అధ్యాపకులు జోనాధన వీక్షిప్ పాల్గొన్నారు.