Share News

వ్యవ‘సాయానికి’ ఏఐ

ABN , Publish Date - Feb 10 , 2026 | 05:14 AM

వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ అమలుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, వధ్వానీ ఏఐ(న్యూఢిల్లీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

వ్యవ‘సాయానికి’ ఏఐ

  • వధ్వానీ ఏఐతో వ్యవసాయ శాఖ ఒప్పందం

అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ అమలుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, వధ్వానీ ఏఐ(న్యూఢిల్లీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ సమక్షంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌, వధ్వానీ ఏఐ డైరెక్టర్‌ జేపీ త్రిపాఠి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో రైతు కేంద్రీకృత సేవల విస్తరణతోపాటు వ్యవసాయ విస్తరణను మరింత సమర్ధవంతంగా మార్చే దిశగా కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించుకునేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ఈ ఒప్పందం కీలకమౌతుందన్నారు. ముందస్తు అంచనా విశ్లేషణల ద్వారా పంటల తక్షణ స్థితి, పురుగులు, తెగుళ్లపై హెచ్చరికలు, డేటా ఆధారంగా రైతులకు సలహాలు ఇచ్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థ పని చేస్తుందని వివరించారు.

Updated Date - Feb 10 , 2026 | 05:15 AM