Share News

అమరావతిలో ‘ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌’ వర్సిటీ

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:54 AM

అమరావతిలో మరో ప్రతిష్టాత్మక కృత్రిమ మేధ యూనివర్సిటీ రానుంది. ‘ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌’ పేరిట ఈ వర్సిటీని ఏర్పాటు చేసేందుకు సంబంధించి ఐటీ శాఖ...

అమరావతిలో ‘ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌’ వర్సిటీ

  • రాష్ట్ర ఐటీ శాఖ ప్రతిపాదనలు.. నేడు క్యాబినెట్‌ ఆమోదం!

అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో మరో ప్రతిష్టాత్మక కృత్రిమ మేధ యూనివర్సిటీ రానుంది. ‘ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌’ పేరిట ఈ వర్సిటీని ఏర్పాటు చేసేందుకు సంబంధించి ఐటీ శాఖ ప్రతిపాదనను మంగళవారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. యూనివర్సిటీల్లో సాధారణంగా యూజీ విద్య మొదలుకొని ఆపై కోర్సులు ఉంటాయి. కానీ, ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌ వర్సిటీలో పాఠశాల విద్యార్ధుల నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో విద్యా బోధన అందిస్తారు. ఇప్పటికే అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యాలీ రానున్న నేపథ్యంలో.. ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌ అనుబంధంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ మంగళవారం హైదరాబాద్‌లో దాదాపు డజను ప్రముఖ ఐటీ కంపెనీలతో సమావేశం కానున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 03:56 AM