Share News

ఏఐతో భూగర్భ జలాల అంచనా

ABN , Publish Date - Feb 26 , 2026 | 04:54 AM

భూగర్భ జలవనరుల అంచనా, సమర్థ నిర్వహణ, వినియోగానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర భూగర్భ జలవనరుల...

ఏఐతో భూగర్భ జలాల అంచనా

  • సమర్థ నిర్వహణ, వినియోగానికి దోహదం

  • ఏపీలో భూగర్భ జలాల పరిస్థితి భేష్‌

  • సీజీడబ్ల్యూబీ సభ్యుడు వరదరాజ్‌

విజయవాడ సిటీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలవనరుల అంచనా, సమర్థ నిర్వహణ, వినియోగానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర భూగర్భ జలవనరుల బోర్డు(సీజీడబ్ల్యూబీ) సభ్యుడు ఎన్‌.వరదరాజ్‌ అన్నారు. గతంలో భూగర్భ జలాలను పదేళ్లకు ఒకసారి, ఆ తరువాత ఐదేళ్లకు, రెండేళ్లకు ఒకసారి అంచనా వేసేవారని, ఇప్పుడు ఏడాదికి ఒకసారి అంచనా వేస్తున్నారని చెప్పారు. బుధవారం విజయవాడలో భూగర్భ జలాల డేటా, జలధార పొరల మ్యాపింగ్‌ ఫలితాల ప్రచారం అనే అంశాలపై సీజీడబ్ల్యూబీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ నిర్వహించింది. వరదరాజ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 2012లో జాతీయ జలధార పొరల మ్యాపింగ్‌ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1.46 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో మ్యాపింగ్‌ పూర్తయినట్లు వివరించారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 679 అసె్‌సమెంట్‌ యూనిట్ల(మండలాల)లో 601 యూనిట్లు సురక్షితంగా ఉన్నాయన్నారు. ఏపీలో భూగర్భ జలాల పరిస్థితి సురక్షితంగా ఉందని చెప్పారు. అయితే దీర్ఘకాలిక స్థిరత్వం కోసం సంరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సీజీడబ్ల్యూబీ ఏపీ, తెలంగాణ డైరెక్టర్‌ కె.ఎన్‌.జ్యోతికుమార్‌ ఏపీ గ్రౌండ్‌ వాటర్‌ డైరెక్టర్‌ కె.ఎ్‌స.శాస్త్రి, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 04:55 AM