ప్రత్యేక న్యాయస్థానం పని ప్రారంభించాలి
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:32 AM
అగ్రిగోల్డ్ కస్టమర్ల సమస్యల పరిష్కారానికి ఈ నెలాఖరులోగా ప్రత్యేక న్యాయస్థానం పని ప్రారంభించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్..
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్
అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్ కస్టమర్ల సమస్యల పరిష్కారానికి ఈ నెలాఖరులోగా ప్రత్యేక న్యాయస్థానం పని ప్రారంభించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సీఐడీతో డెడికేటెడ్ బృందాన్ని నియమించాలని కోరారు. ఆదివారం విజయవాడలో మాట్లాడుతూ మార్చి 6న నిరవధిక దీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక న్యాయస్థానం, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. యాజమాన్యం బినామీ ఆస్తులన్నింటినీ అటాచ్‌చేయాలని, కంపెనీ భూములను బహిరంగ వేలం వేయాలని కోరారు.