వైసీపీది తప్పుడు ప్రచారం: అచ్చెన్న
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:54 AM
రాష్ట్రంలో పండించిన పంటలకు మద్దతు ధర దక్కడం లేదంటూ వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు
అమరావతి, మార్చి10(ఆంధజ్ర్యోతి): రాష్ట్రంలో పండించిన పంటలకు మద్దతు ధర దక్కడం లేదంటూ వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సొంత పత్రికలో తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని మంగళవారం హెచ్చరించారు. ‘వైసీపీ హయాంలో రైతులు అప్పులపాలై నష్టాల ఊబిలో కూరుకుపోయారు. కూటమి ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ, విపత్తులకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా అందిస్తున్నాం. పంటలకు కనీస మద్దతు ధర పథకాన్ని అమలు చేస్తున్నాం’ అని అచ్చెన్న వివరించారు.