Share News

వచ్చే 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తాం

ABN , Publish Date - Jan 24 , 2026 | 06:18 AM

సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 16 నుంచి సహకార సంఘ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగనున్నారు.

వచ్చే 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తాం

  • వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల జేఏసీ

విజయవాడ (గాంధీనగర్‌), జనవరి 23(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 16 నుంచి సహకార సంఘ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. ఈమేరకు సహకార సంఘ ఉద్యోగుల జేఏసీ నేత బొల్లినేని రఘురామ్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 6నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామని, ఈ నెల 27నుంచి ఫిబ్రవరి 12 వరకు గుంటూరులోని సహకార శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమం చేపడతామన్నారు. 13న కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఫిబ్రవరి 16 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. జీవో 36ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 24 , 2026 | 06:18 AM