Share News

అమరావతిలో అంతర్జాతీయ న్యాయ వర్సిటీ

ABN , Publish Date - Mar 07 , 2026 | 06:01 AM

ప్రజా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యాసంస్థ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) - పెరల్‌ ఫస్ట్‌ ఆధ్యరంలో...

అమరావతిలో అంతర్జాతీయ న్యాయ వర్సిటీ

  • ఏపీ సీఆర్డీఏ, బీసీఐ ట్రస్ట్‌ మధ్య కుదిరిన ఒప్పందం

తుళ్లూరు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ప్రజా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యాసంస్థ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) - పెరల్‌ ఫస్ట్‌ ఆధ్యరంలో ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐయూఎల్‌ఈఆర్‌) స్థాపనకు శుక్రవారం ఒప్పందం కుదిరింది. అమరావతిలోని మందడం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్‌ సీహెచ్‌ రాంబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఏపీ సీఆర్డీఏ తరఫున జాయింట్‌ డైరెక్టర్‌ (ఎస్టేట్స్‌) జుబిన్‌ చిరాన్‌ రాయ్‌, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా-పెరల్‌ ట్రస్ట్‌ కార్యానిర్వాహక కార్యదర్శి అశోక్‌ కుమార్‌ పాండే సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. రాజధాని అమరావతిలోని శాఖమూరు రెవెన్యూలో 55 ఎకరాల భూమిని భారత బార్‌ కౌన్సిల్‌ ట్రస్ట్‌ - పెరల్‌ ఫస్ట్‌కు ఏపీ సీఆర్డీఏ కేటాయించింది. సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌, బీసీఐ ట్రస్ట్‌ - పెరల్‌ ఫస్ట్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు మనన్‌కుమార్‌ మిశ్రా ఆలోచనతో ఈ పాజ్రెక్టు ప్రారంభమైంది.

Updated Date - Mar 07 , 2026 | 06:02 AM