ఏసీబీకి చిక్కిన ఏఈవో
ABN , Publish Date - May 14 , 2026 | 12:08 AM
ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుదవారం దాడులు నిర్వహించారు.
రూ.30 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు
కేసు నమోదు చేసి రిమాండ్ తరలింపు
ఎమ్మిగనూరు, మే13 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుదవారం దాడులు నిర్వహించారు. ఓఎరువుల దుకాణం యజమాని రంగన్న గౌడ్ నుంచి రూ.30వేలు ఏఈవో(అగ్నికల్చర్ ఎక్స్‌టెన్షన ఆఫీసర్) నరసింహులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలో అనధికారికంగా కంప్యూటర్ ఆపరేటర్ మన్మోహనను సైతం అదుపులోకి తీసు కొని అతని దగ్గర ఉన్న రూ. 73,600ను స్వాధీనం చేసుకుని మొత్తం రూ.1,03,600 సీజ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. వివరాలు.. పట్టణంలోని మహాలక్ష్మి ట్రెడర్స్ యజమాని రంగన్నగౌడ్ సీడ్స్ విక్రయాల లైసెన్స కాలపరిమితి పూర్తి కావటంతో కొత్త లైసన్స కోసం ఏవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. లైసెన్స ఇచ్చేందుకు ఏఈవో నరసింహులు రూ.35వేలు డిమాండ్ చేశాడు. బుదవారం రూ.30వేలు, లైసెన్స ఇచ్చాక రూ.5వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు రంగన్న గౌడ్ రెండు రోజుల కిత్రం ఫిర్యాదు చే శాడు. కేసునమోదు చేసుకున్న అధికారులు రంగన్న గౌడ్‌నుంచి రూ.30వేలు మన్మోహన ద్వారా ఏఈవో తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఏఈవో నరసింహులు, అనధికార కంప్యూటర్ ఆపరేటర్ మన్మోహనపై కేసునమోదు చేసి రిమాం డ్‌కు తరలించారు. వ్యవసాయ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులతో చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో కలకలం రేపింది. కొంతమంది సిబ్బంది చెప్పా పెట్టకుండా కార్యాలయాల నుంచి జారుకున్నారు. దాడుల్లో సీఐలు కృష్ణయ్య, రాజాప్రభాకర్, ఎస్‌ఐ సుబ్బరాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.