ఏఈ నూకరాజు భార్య మృతదేహం లభ్యం
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:10 AM
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆయన భార్య మీనా మృతదేహం శనివారం లభ్యమైంది. ఈ నెల 16న రాత్రి నూకరాజు..
రాజమహేంద్రవరం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆయన భార్య మీనా మృతదేహం శనివారం లభ్యమైంది. ఈ నెల 16న రాత్రి నూకరాజు.. తన భార్య మీనా, కూతురు సౌజన్య, మనుమడు కార్తికేయతోసహా గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. కార్తికేయకు ఈత రావడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. నూకరాజు మృతదేహం 17న లభ్యం కాగా.. కుమార్తె సౌజన్య మృతదేహం గురువారం లభ్యమైంది. గాలింపు కొనసాగిస్తున్న ఎస్డీఆర్‌ఎఫ్, పోలీసుల బృందం శనివారం కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల సమీపంలో గోదావరి ఒడ్డున మీనా మృతదేహాన్ని గుర్తించారు.