న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురండి
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:31 AM
రాష్ట్రంలో న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కిరణ్ తిరుమలశెట్టి కోరారు.
హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కిరణ్
అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కిరణ్ తిరుమలశెట్టి కోరారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో న్యాయవాదులపై అనుచితంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ఒకటి క్లైంటు రూపంలో, కొద్దిమంది తమకు నచ్చని, తమకు వ్యతిరేకంగా ఏదైనా కేసు వేస్తే దాడులు చేస్తున్నారని అన్నారు. కొంత పొలిటికల్‌గా కూడా దాడులు జరుగుతున్నాయన్నారు. పోలీస్ వ్యవస్థలో కూడా వీటికి సరైన స్పందన లభించడం లేదన్నారు. న్యాయవాదుల వినతులను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశామన్నారు.