Share News

ఆదోని సబ్‌ జైలు తనిఖీ

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:15 AM

పట్టణంలోని సబ్‌జైలును గు రువారం ఆదోని 1వ అ దనపు జ్యుడీషియల్‌ మేజిస్ర్టేట్‌ సుభాష్‌ తని ఖీ చేశారు. ఖైదీల బరా క్స్‌, వంట గది, రేషన్‌ స్టోర్‌ను పరిశీలించారు.

ఆదోని సబ్‌ జైలు తనిఖీ
మాట్లాడుతున్న మేజిస్ర్టేట్‌ సుభాష్‌

ఆదోని, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సబ్‌జైలును గు రువారం ఆదోని 1వ అ దనపు జ్యుడీషియల్‌ మేజిస్ర్టేట్‌ సుభాష్‌ తని ఖీ చేశారు. ఖైదీల బరా క్స్‌, వంట గది, రేషన్‌ స్టోర్‌ను పరిశీలించారు. భోజన సదుపాయాలు, ఇతర వసతుల గురించి స్వయంగా ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేజిస్ర్టేట్‌ సుభాష్‌ మాట్లాడుతూ ఖైదీలకు ఉచిత న్యాయ సాయం పొందే హక్కు ఉందని గుర్తు చేశారు. ఆర్థిక స్థోమత లేని కారణంగా న్యాయవాదిని నియమించుకోలేని పక్షంలో లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం అంది స్తామని ఖైదీలకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో జైలు సూపరిం టెండెంట్‌ నజీర్‌అహ్మద్‌తో పాటు కారాగార సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:15 AM