నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆదోని వాసులు సురక్షితం
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:13 PM
కైలాస యాత్రకు వెళ్లి నేపాల్-టిబెట్ సరిహద్దులో వరదల కారణంగా చిక్కుకుపోయిన ఆదోని పట్టణం ఎంఐజీ కాలనీకి చెందిన భాస్కర శాసి్త్ర కుటుంబ సభ్యులు సురక్షితంగా తిరుగు ప్రయాణమయ్యారు.
- డార్చెన్ నుంచి సాగాకు భాస్కర శాసి్త్ర కుటుంబం
ఆదోని, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కైలాస యాత్రకు వెళ్లి నేపాల్-టిబెట్ సరిహద్దులో వరదల కారణంగా చిక్కుకుపోయిన ఆదోని పట్టణం ఎంఐజీ కాలనీకి చెందిన భాస్కర శాసి్త్ర కుటుంబ సభ్యులు సురక్షితంగా తిరుగు ప్రయాణమయ్యారు. రెండు రోజులుగా డార్చెన్‌లో చిక్కుకున్న వారు గురువారం సాయంత్రం అక్కడి నుంచి సాగాకు బయలుదేరారు. డార్చెన్ నుంచి సాగా వరకు సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి సమయంలో ప్రయాణం చేయరాదని అధికారుల ఆదేశాలతో వారు సాగాలోనే బస చేశారు. అడ్డదారుల్లో కాకుండా రెగ్యులర్‌గా వెళ్లే దారిలోనే వారిని తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం భాస్కర శాసి్త్ర కుమారుడికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఒక్కరోజంతా మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదోని వాసులను సురక్షితంగా తీసుకువచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిలీల్లోని ప్రత్యేక అధికారి కిశోర్‌తో మాట్లాడారు. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలిచి వారి భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.