Share News

ఆదివాసీ హక్కులను పరిరక్షించండి

ABN , Publish Date - May 18 , 2026 | 05:06 AM

ఆదివాసీ హక్కులను పరిరక్షించాలని కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి జువల్‌ ఒరామ్‌ను గిరిజన సంఘాల నేతలు కోరారు.

ఆదివాసీ హక్కులను పరిరక్షించండి

  • కేంద్రమంత్రి జువల్‌ ఒరామ్‌కు గిరిజన సంఘాల వినతి

న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ హక్కులను పరిరక్షించాలని కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి జువల్‌ ఒరామ్‌ను గిరిజన సంఘాల నేతలు కోరారు. న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ (ఏఏఆర్‌ఎం), ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ గిరిజన సంఘం (ఏజీఎస్‌) నేతలు ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఆదివాసీలకు రాజ్యాంగం ద్వారా లభించిన 5వ షెడ్యూల్‌ హక్కులు, రిజర్వేషన్లు, భూమి రక్షణ చట్టాలు అమలు చేేసలా చూడాలని నేతలు జితేంద్ర చౌదరి, బృందా కారత్‌, బి. వెంకట్‌, పి.అప్పల నరస, కె.సురేంద్ర కోరారు.

Updated Date - May 18 , 2026 | 06:07 AM