Share News

‘ఆదిత్య’లో ఎంఎస్‌సీ రియల్‌ ఎస్టేట్‌ వాల్యుయేషన్‌ కోర్సు ప్రారంభం

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:45 AM

ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వాల్యూర్స్‌ ఇండియా (ఐఓవీ) సౌజన్యంతో కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో..

‘ఆదిత్య’లో ఎంఎస్‌సీ రియల్‌ ఎస్టేట్‌ వాల్యుయేషన్‌ కోర్సు ప్రారంభం

గండేపల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి): ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వాల్యూర్స్‌ ఇండియా (ఐఓవీ) సౌజన్యంతో కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఎంఎస్‌సీ రియల్‌ ఎస్టేట్‌ వాల్యుయేషన్‌ కోర్సు ప్రారంభిస్తున్నట్టు వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సతీష్‌ రెడ్డి తెలిపారు. మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా 50 శాతం మార్కులతో డిగ్రీ పాసైన వారికి ఈ కోర్సు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఆదిత్య యూనివర్సిటీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రెండు సంవత్సరాల డిగ్రీ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 05:46 AM