Share News

Araku Passenger Train: అరకులోయ ప్యాసింజర్‌కు అదనపు విస్టాడోమ్‌ కోచ్‌

ABN , Publish Date - Jan 06 , 2026 | 06:12 AM

పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ-కిరండూల్‌ మధ్య నడుస్తున్న పాసింజర్‌ (అరకు ట్రైన్‌) రైళ్లకు అదనపు విస్టాడోమ్‌ కోచ్‌ (అద్దాలబోగీ)ను జత చేస్తున్నామని...

Araku Passenger Train: అరకులోయ ప్యాసింజర్‌కు అదనపు విస్టాడోమ్‌ కోచ్‌

విశాఖపట్నం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ-కిరండూల్‌ మధ్య నడుస్తున్న పాసింజర్‌ (అరకు ట్రైన్‌) రైళ్లకు అదనపు విస్టాడోమ్‌ కోచ్‌ (అద్దాలబోగీ)ను జత చేస్తున్నామని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు. మరికొన్ని రైళ్లకు కూడా అదనపు కోచ్‌లు జత చేస్తున్నామని పేర్కొన్నారు. విశాఖ-కిరండూల్‌ పాసింజర్‌ (58501)కు ఈ నెల 7, 9, 11, 13, 17, 19, 21, 23, 35, 27, 29న, తిరుగు ప్రయాణంలో కిరండూల్‌-విశాఖ పాసింజర్‌కు (58502) ఈ నెల 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 తేదీల్లో ఒక విస్టాడోమ్‌ కోచ్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే సంత్రాగచ్చి-యలహంక ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు (02863)కు ఈ నెల 8న ఒక థర్డ్‌ ఏసీ కోచ్‌ జత చేస్తున్నామన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 06:12 AM