Share News

AP Govt: కృష్ణా బోర్డులో ఏపీ అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు

ABN , Publish Date - Jan 15 , 2026 | 04:07 AM

కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)లో ఇద్దరు అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

AP Govt: కృష్ణా బోర్డులో ఏపీ అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు

హైదరాబాద్‌, జనవరి 14(ఆంధ్రజ్యోతి): కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)లో ఇద్దరు అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బోర్డులో డీఈఈగా పనిచేస్తున్న పి.రవిచంద్రకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. విజయవాడలో ప్రాజెక్ట్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌లో ఈఈగా పనిచేస్తున్న బి.హై్‌పజినత్‌కు ఎస్‌ఈగా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jan 15 , 2026 | 04:07 AM