Share News

అద్దంకిలో రైతు బజారు ఏర్పాటుకు సన్నాహాలు

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:50 AM

ప్రకాశం జిల్లా అద్దంకిలో రైతు బజారు ఏర్పాటుకు సన్నాహాలు జరుగు తున్నాయి. పట్టణంలో ఏప్రిల్‌ 9వ తేదీన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన..

అద్దంకిలో రైతు బజారు ఏర్పాటుకు సన్నాహాలు

  • మంత్రి రవికుమార్‌ కృషితో మంజూరు

  • ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’కు స్పందన

అద్దంకి, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా అద్దంకిలో రైతు బజారు ఏర్పాటుకు సన్నాహాలు జరుగు తున్నాయి. పట్టణంలో ఏప్రిల్‌ 9వ తేదీన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా రైతు బజారు ఏర్పాటు గురించి పలువురు వినతిపత్రాలు అందజేశారు. దీనిపై మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. ఈక్రమంలో అద్దంకి మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో యార్డు ఆవరణలో రైతు బజారు ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చారు. అద్దంకి మార్కెట్‌ యార్డు ఆవరణలో ఇప్పటి వరకూ ప్రతి ఆదివారం మాత్రమే అన్నగారి సంత నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలోని రైతులు తాము పండించిన కూరగాయలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో మంత్రి రవికుమార్‌ చొరవతో రైతు బజారు మంజూరైంది. మంత్రి రవికుమార్‌ చొరవతో రైతు బజారు మంజూరైంది.

Updated Date - Jun 01 , 2026 | 05:50 AM