‘ఉపాధి’లో అవినీతికి పాల్పడితే చర్యలు
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:36 AM
జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని, రికవరీ కట్టకపోతే కేసులు నమోదు చేస్తామని డ్వామా పీడీ మాధవీలత హెచ్చరించారు.
రికవరీలు కట్టకపోతే కేసులు
కూలీలందరికీ పనులు కల్పించాలి
డ్వామా పీడీ మాధవీలత
తుగ్గలి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని, రికవరీ కట్టకపోతే కేసులు నమోదు చేస్తామని డ్వామా పీడీ మాధవీలత హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏపీవో కార్యాలయం ఎదుట సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025లో జరిగిన దాదాపు రూ.23 కోట్లతో ఉపాధి పనులు, హౌసింగ్, హార్టికల్చర్, సీసీ రోడ్ల నిర్మాణాలపై ఖర్చు చేశారు. ఇందులో రూ.1,38,864లు రికవరీ, రూ.18వేలు ఫెనాల్టీ విధించా రు. ఈ పనులను సామాజిక తనిఖీ బృందాలు నెల రోజుల పాటు తనిఖీలు చేసి పనులు పరిశీలించారు. ఆ పనుల్లో జరిగిన అవకతవకలపై బహిరంగ చర్చా వేదికలో చదివి వినిపించారు. పనులు చేయకుండా బిల్లులు కాజేసిన వారు, సక్రమంగా పనులు చేయని వారికి అధికారులు రికవరీలు, పెనాల్టీలు రాశారు. ఆ మొత్తాన్నంతా వారం లోపు చెల్లించాలని, లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటా మన్నారు. కూలీలందరికీ పనులు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీడీ లక్ష్మన, ఏపీవోలు రామకృష్ణ, హేమసుందర్, ఈసీ రాజశేఖర్, టీఏలు, ఉపాది సిబ్బంది పాల్గొన్నారు.