Share News

నేరప్రవృత్తిని మార్చుకోకపోతే చర్యలు

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:51 PM

నేర ప్రవృత్తి మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని పత్తికొండ రూరల్‌ సీఐ పులిశేఖర్‌ హెచ్చరించారు.

 నేరప్రవృత్తిని మార్చుకోకపోతే చర్యలు
రాంపల్లిలో ప్రజలకు సూచనలు చేస్తున్న సీఐ పులిశేఖర్‌

సీఐ పులిశేఖర్‌

రాంపల్లిలో కార్డనసెర్చ్‌

తుగ్గలి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): నేర ప్రవృత్తి మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని పత్తికొండ రూరల్‌ సీఐ పులిశేఖర్‌ హెచ్చరించారు. శనివారం తెల్లవారుజామున రాంపల్లిలో కార్డన సెర్చ్‌ నిర్వహించారు. నేరప్రవృత్తి కలిగిన వారి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. అలాగే గ్రామంలో పోలీస్‌ కవాత నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో సీఐ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతమైన జీవనం సాగించాలని, పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అలాంటిది ప్రజా జీవనానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేర ప్రవృత్తి కలిగిన వారు సాధారణ జీవనం సాగిస్తే ఉన్న కేసులు కూడా ఎత్తివేస్తామన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెలో నాటుసారా, అక్రమ మద్యం గంజాయి వంటి మత్తు పదార్థాలను తీసుకురావడంతో యువత పెడదోవ పడుతున్నాయనీ, దీంతో అల్లర్లు ప్రారంభమవుతాయన్నారు. అలాగే సైబర్‌ నేరా లు, క్రికెట్‌ బెట్టింగ్‌ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పత్తికొండ పట్టణ సీఐ, తుగ్గలి, జొన్నగిరి, మద్దికెర ఎస్‌ఐలు నరేష్‌, మల్లికార్జున, హరిత పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:51 PM