Share News

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:09 AM

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, స్టాక్‌ రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని ఎమ్మిగనూరు ఏడీఏ మహ్మద్‌ ఖాద్రీ ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఆదోనిలో ఎరువు దుకాణంలో యూరియాను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు

ఎమ్మిగనూరు ఏడీఏ మహ్మద్‌ ఖాద్రీ

ఆదోని అగ్రికల్చర్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, స్టాక్‌ రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని ఎమ్మిగనూరు ఏడీఏ మహ్మద్‌ ఖాద్రీ ఆదేశించారు. సోమవారం పట్టణంలోని ఎరువుల దుకాణాలను ఏవో సుధాకర్‌తో కలిసి ఏడీఏ ఆకస్మిక తనిఖీ చేశారు. సెవెన హిల్స్‌ ఫర్టిలైజర్‌, శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్‌, శ్రీ నందీశ్వర ట్రేడర్స్‌ కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ పాడేగల్‌ మురళీధర్‌ ఎరువుల దుకాణం, శ్రీలక్ష్మి గణేష్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, శ్రీ బవసవేశ్వర ఫర్టిలైజర్స్‌ దుకాణాలను పరిశీలించారు. ఎరువుల నిలువలు స్టాక్‌ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. క్రయవిక్రయాలపై ఆరా తీశారు. శ్రీ లక్ష్మీ గణేష్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ స్లో యూరియా రిజిస్టర్‌లో స్టాక్‌ అప్‌డేట్‌ చేయించుకోకపోవడంతో రూ. 94,874 విలువగల యూరియా తాత్కాలికంగా నిలుపుదల చేశామని ఏవో సుధాకర్‌ తెలిపారు. ఎరువుల వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం తప్పనిసరిగా యూరియా డీఏపీఏఐ ఎంఎస్‌ యాప్‌ ద్వారా క్రయవిక్రయాలు జరపాలని సూచించారు.

అనుమతులు లేకుండా విక్రయిస్తే కేసులు

పత్తికొండ: ప్రభుత్వ అనుమతులు లేకుండా బయో మందులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఏడీఏ మోహన విజయ్‌ కుమార్‌ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్‌, వెంకట రమణ అగ్రో ఏజెన్సీస్‌, రవి కిరణ్‌ ట్రేడర్స్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ అగ్రో ఏజెన్సీస్‌ ఫర్టిలైజర్స్‌ దుకాణాలను ఏవో వెంకట్రాముడుతో కలిసి తనిఖీ చేశారు. బయో మందుల అమ్మకానికి ఫారం 2 అనుమతులు తప్పనిసరిన్నారు. రూ. 16,65,903 విలువ గల బయో మందులను సీజ్‌ చేశారు వారి వెంట ఏఈవో శ్రీనాథ్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 12:09 AM