అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవు
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:21 AM
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే జైలుకు వెళ్లక తప్పవని ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ హెచ్చరించారు.
ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్
జానాల గూడెంలో పీఎస్ కమిటీ సమావేశం
కొత్తపలి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే జైలుకు వెళ్లక తప్పవని ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ హెచ్చరించారు. శనివారం మండలంలోని జానాల గూడెంలో పీఎస్ కమిటీ సమావేశం గ్రామస్థులతో నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ 10 రోజుల క్రితం జానాల గూడెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందన్నారు. ఇందులో తొమ్మిది మందిపై కేసు నమోదు అయిందన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే అందరు కలిసి పరిష్కరించుకోవాలన్నారు. మరోసారి ఘర్షణలు, అల్లర్లు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ సురేష్ కుమార్ రెడ్డి, ఆర్డీవో నాగజ్యోతి, తహసీల్దార్ ఉమారాణి మత్స్యశాఖ ఎఫ్‌డీవో భరత లాల్ నాయక్, ఏపీ టూరిజం అధికారి విజయలక్ష్మి, ఇరిగేషన డీఈ మోహనరావు, ఎస్సీ, బీసీ వెల్ఫేర్ అధికారులు ఎస్సీ, ఎస్టీ మైనార్టీ లీగల్ అడ్వైజర్ గిరి తదితరులు పాల్గొన్నారు.