జెట్టి రేణుక ఫిర్యాదుపై సత్వర చర్యలు తీసుకుంటాం: సీఐ
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:28 AM
టీడీపీ సీనియర్ మహిళా కార్యకర్త చేసిన ఫిర్యాదుపై సత్వరమే చర్యలు తీసుకుంటామని తెనాలి రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్ మంగళవారం తెలిపారు.
తెనాలి క్రైం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్ మహిళా కార్యకర్త చేసిన ఫిర్యాదుపై సత్వరమే చర్యలు తీసుకుంటామని తెనాలి రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్ మంగళవారం తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన జెట్టి రేణుక ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఫొటోలను వైసీపీకి చెందిన కొందరు అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. తన పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.