కంపెనీపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - May 19 , 2026 | 12:01 AM
రైతుల పొలాల్లో వి ద్యుత్ స్తంభాలు నాటి రైతులకు ఇంతవరకు పైసా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న జొన్నగిరి గోల్డ్ మైనింగ్ కంపెనీపై చర్య లు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బ్రహ్మయ్య, మం డల అధ్యక్షులు కరణం నరేష్ డిమాండ్ చేశారు.
పత్తికొండ టౌన్, మే 18 (ఆంధ్రజ్యోతి): రైతుల పొలాల్లో వి ద్యుత్ స్తంభాలు నాటి రైతులకు ఇంతవరకు పైసా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న జొన్నగిరి గోల్డ్ మైనింగ్ కంపెనీపై చర్య లు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బ్రహ్మయ్య, మం డల అధ్యక్షులు కరణం నరేష్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఆర్డీవో ఓబులేష్‌కు బీజేపీ బృందం నాయకులు వినతి పత్రం అందిం చారు. వారు మాట్లాడుతూ గ్రామ రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత స్తంభానికి రూ.6 వేలు చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారని, ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదన్నారు. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేసేలా చూడాలని కోరారు. నాయకులు మల్లికార్జున, గోరంట్లప్ప, వీరేష్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.