Minister Kondapalli Srinivas Rao: ‘ఇంటికో పారిశ్రామిక వేత్త’ లక్ష్యం సాధించాలి
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:22 AM
ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు పని చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఎంఎస్ఎంఈడీసీ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కొండపల్లి
అమరావతి/తాడేపల్లి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ‘ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు పని చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం మంగళగిరిలో నిర్వహించిన రాష్ట్ర ఎంఎస్ఎంఈడీసీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటికొక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో చిన్న పరిశ్రమల స్థాపనకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు ఎంఎస్ఎంఈడీసీ బోర్డు డైరెక్టర్లు ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసేలా బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. ఎంఎస్ఎంఈడీసీ బోర్డు డైరెక్టర్లుగా బండారు రవికాంత్ (తెనాలి), అంబటి భూలక్ష్మి (పి.గన్నవరం), భూమే వెంకట నారాయణ (రాప్తాడు), డాక్టర్ చిన్నరాజు గుడిపూడి (పెదకూరపాడు), రాపర్ల జగన్నాథరావు (వినుకొండ), వాయుగండ్ల కౌశిక్ (కర్నూలు), మురళీమోహన్ (చంద్రగిరి), నల్లే వీరప్రసన్నకుమార్ (కాకినాడ రూరల్), నీలపు విజయానందరెడ్డి (విశాఖపట్నం), ప్రధాన విజయరామ్ (శ్రీకాకుళం), ముగడ రాజారావు (విశాఖపట్నం తూర్పు), వి.వి.సత్యనారాయణమూర్తి పోతుల (పాలకొల్లు), రావిల్ల వీరేందర్ కుమార్ (కోవూరు)లు మంత్రి సమక్షంలో డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు, సీఈవో విశ్వ మనోహర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.