Share News

తోతాపురి కొనుగోళ్లపై వైసీపీ తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:22 AM

తోతాపురి మామిడి రైతుల్ని తప్పుదారి పట్టిస్తూ, వైసీపీ సోషల్‌ మీడియా చేస్తున్న విష ప్రచారంపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

తోతాపురి కొనుగోళ్లపై వైసీపీ తప్పుడు ప్రచారం

  • క్రిమినల్‌ కేసులు పెడతాం: అచ్చెన్న

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): తోతాపురి మామిడి రైతుల్ని తప్పుదారి పట్టిస్తూ, వైసీపీ సోషల్‌ మీడియా చేస్తున్న విష ప్రచారంపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మామిడి కొనుగోళ్లు, పల్ప్‌ పరిశ్రమ అంశాలపై ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గతేడాది తోతాపు రి మామిడి రైతులు ఇబ్బందిపడితే కూట మి ప్రభుత్వం రైతుల్ని ఆదుకుందని, ఈ ఏడాది కూడా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా, మామిడి కొనుగోళ్లు వేగంగా జరిగేలా అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు.

Updated Date - Jun 10 , 2026 | 05:23 AM