Share News

పెట్టుబడులు, కేటాయింపులకు తేడా తెలీదా? జగన్‌ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్న ఫైర్‌

ABN , Publish Date - Oct 05 , 2026 | 06:28 AM

రాయలసీమకు పెట్టుబడులు రావడం, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించే ప్రయత్నాలు కూడా జగన్‌కు తప్పుగానే కనిపిస్తున్నాయా? అని మంత్రి అచ్చెన్నాయుడు నిలదీశారు.

పెట్టుబడులు, కేటాయింపులకు తేడా తెలీదా?  జగన్‌ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్న ఫైర్‌
achennanaidu

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): రాయలసీమకు పెట్టుబడులు రావడం, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించే ప్రయత్నాలు కూడా జగన్‌కు తప్పుగానే కనిపిస్తున్నాయా? అని మంత్రి అచ్చెన్నాయుడు నిలదీశారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన జగన్‌కు రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు, బడ్జెట్‌ కేటాయింపులకు తేడాతెలియదా? పెట్టుబడులను కూడా బడ్జెట్‌ కేటాయింపులుగా చూపించాలా? అని ప్రశ్నించారు. పూర్వోదయ పథకం ద్వారా రూ.40వేల కోట్లు, ప్రైవేట్‌ రంగం నుంచి రూ.60వేల కోట్ల పెట్టుబడులు సమీకరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కరువు సీమలో సిరులు కురిపించే గ్లోబల్‌ హార్టీకల్చర్‌ హబ్‌ గురించి వాస్తవాలు తెలుసుకోకుండా, రైతుల కోసం పనిచేస్తున్న సీఎం చంద్రబాబుని విమర్శించే ముందు తన ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగాన్ని ఏ స్థితికి తెచ్చారో జగన్‌ ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో పబ్‌జీ ఆడుకునే జగన్‌కు రైతుల సంక్షేమం, అభివృద్ధిపై అవగాహన శూన్యమని ఎద్దేవా చేశారు. పంట ఉత్పత్తుల ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకున్న చర్యలపై పంటల వారీగా చర్చకు సిద్ధమా? అని సవాల్‌ చేశారు.

Updated Date - Oct 05 , 2026 | 06:29 AM