విలేకరి జగన్ హత్యకేసు నిందితులకు రిమాండ్
ABN , Publish Date - May 08 , 2026 | 05:04 AM
చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్‌రెడ్డి హత్యకేసులో నిందితులు తమీమ్, సుభాన్‌ను పోలీసులు గురువారం పలమనేరు కోర్టులో..
రామకుప్పం, మే 7 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్‌రెడ్డి హత్యకేసులో నిందితులు తమీమ్, సుభాన్‌ను పోలీసులు గురువారం పలమనేరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండు విధించారు. నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేసినట్టు పోలీసులు తెలిపారు. మార్చి 28వ తేదీ ఉదయం జగన్మోహన్‌రెడ్డిని వి.కోటకే చెందిన రౌడీ షీటర్ తమీమ్, అతని బావమరిది సుభాన్‌తో కలిసి కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే.