Share News

పేరుకుపోయిన నీటి పన్ను బకాయిలు

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:38 PM

ఆదోని మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి పన్నుల చెల్లింపు నత్తనడకన సాగుతుండడంతో బకాయిలు రూ. కోట్లలో పేర్కొన్నాయి.

పేరుకుపోయిన నీటి పన్ను బకాయిలు
ఆదోని మున్సిపల్‌ కార్యాలయం

కొళాయి కనెక్షన తొలగించనున్న అధికారులు

ఆదోని టౌన, జూలై 17(ఆంధ్రజ్యోతి) : ఆదోని మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి పన్నుల చెల్లింపు నత్తనడకన సాగుతుండడంతో బకాయిలు రూ. కోట్లలో పేర్కొన్నాయి. ఆస్తి పన్ను బకాయిలపై మాత్రమే వడ్డీ విధిస్తుండటతో ప్రజలు ఆస్తి పన్నులను సకాలంలో చెల్లిస్తూ తాగునీటి పన్నులను చెల్లించకపోవడంతో బకాయిలు రూ. కోట్లలో పేరుకుపోయాయి. రూ. 2000 నుంచి రూ. 10,000 దాకా చెల్లించాల్సిన నీటి పన్ను బకాయిలు రూ. 4.74 కోట్లు ఉండగా, రూ. పదివేలకు పైగా బకాయి ఉన్న నీటి పన్నులు రూ. 3.81 కోట్ల మేరకు వసూలు కావాల్సి ఉంది. మరొక రూ. 70 లక్షల దాకా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న తాగునీటి పన్నులు వసూలు కావాల్సి ఉంది. నీటి పన్ను బకాయిలను చెల్లించడంపై నిర్లక్ష్యం వహిస్తున్న వారి కొళాయి కనెక్షనలు తొలగించడానికి మున్సిపల్‌ అధికారులు సమాయత్తమవుతున్నారు. నీటి పన్నుల బకాయిలు రూ. కోట్లలో పేరుకపోవడంతో అభివృద్ధి పను ల నిర్వహణ కష్టతరంగా మారింది. దీంతో మున్సిపల్‌ అధికారు లు పన్నుల వసూళ్లపై కఠినంగా వ్యవహరించడానికి సమాయత్తమవుతున్నారు. శనివారం నుంచి బకాయిలు చెల్లించని వారి కొళాయి కనెక్షనను తొలగించడానికి పోలీసు బందోబస్తుతో ప్రత్యేక టీములుగా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. దీనితోపాటు నీటి వృథాను అరికట్టడం కోసం వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారి కొళాయిలకు మీటర్లను ఏర్పాటు చేసి ఇకపై మీటర్‌ రీడింగ్‌ ప్రకారం పన్నులు వసూలు చేయనున్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:38 PM