Share News

టౌన్‌ ప్లానింగ్‌లో ‘అవినీతి’పై వేట!

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:13 AM

భవన నిర్మాణాల ప్లాన్ల అనుమతులు, బీపీఎస్‌, లే అవుట్ల క్రమబద్దీకరణ అంశాలకు సంబంధించి పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు.

టౌన్‌ ప్లానింగ్‌లో ‘అవినీతి’పై వేట!

  • రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లలో ఏసీబీ సోదాలు

  • భవన నిర్మాణాల అనుమతులు, బీపీఎస్‌, లే అవుట్ల

  • క్రమబద్ధీకరణలో అవినీతిపై ఫిర్యాదులతో తనిఖీలు

  • కార్యాలయాల్లో రికార్డులు, కంప్యూటర్ల డేటా స్వాధీనం

  • ఒంగోలులో కిటికీలో నుంచి విసిరేసిన డబ్బు సీజ్‌

  • రాత్రి వరకూ సోదాలు.. నేడు కూడా కొనసాగింపు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

భవన నిర్మాణాల ప్లాన్ల అనుమతులు, బీపీఎస్‌, లే అవుట్ల క్రమబద్దీకరణ అంశాలకు సంబంధించి పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్ల టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఎక్కడెక్కడ అవినీతి జరుగుతోం దో సమాచారాన్ని సేకరించిన ఏసీబీ.. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలకు దిగింది. ప్ర భుత్వం ప్రస్తుతం అక్రమ కట్టడాలు క్రమబద్దీకరణకు ఈ నెల 12, అక్రమ లే అవుట్ల రెగ్యులరైజ్‌కు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది. ఈ క్రమంలో జోరుగా అవినీతి వ్యవహారాలు సాగుతున్నాయన్న ఆరోపణల తో ఆయా కార్పొరేషన్లలోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల నుంచి రికార్డులు, కంప్యూటర్ల డేటాను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పరిధిలోని పెందుర్తి, గాజువాక, మధురవాడ జోనల్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లంచాలు తీసుకున్న అధికారులతో పాటు చేతివాటం ప్రదర్శించిన సిబ్బంది పైనా చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. గాజువాక, తిరుపతి, గుంటూరులో రెవెన్యూ, ఇంజనీరింగ్‌ విభాగాలపైనా ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఏసీబీ అధికారుల తనిఖీలతో ఖంగుతిన్న ఒంగోలు కార్పొరేషన్‌ సిబ్బంది కొందరు తమ వద్ద ఉన్న నగదును కిటికీల్లో నుంచి బయటికి పడేశారు.


అనంతపురం నగరంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం సహకారంతో నివాస, వాణిజ్య భవనాల అనుమతుల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలో అనుమతి లేకుండా నిర్మించిన భవనాలు, నిబంధనలు పాటించని యజమానులు, సిబ్బం ది వద్ద నగదు తదితర అంశాలపై లోతుగా తనిఖీలు చేపట్టారు. ఏలూరు జిల్లా నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో ఇళ్ల నిర్మాణాలు, వాణిజ్య సముదాయాల ప్లాన్లను అధికారులు పరిశీలించారు. తిరుపతిలో 30 కీలక రికార్డులు, హార్డ్‌ డిస్క్‌లు సీజ్‌ చేశా రు. ఒక ఏసీపీ వద్ద రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయవాడలో భవన నిర్మాణాల కోసం ఎన్ని ప్లాన్‌లు వచ్చాయి? ఎన్నింటికి అనుమతు లు ఇచ్చారు? అనే వివరాలు సేకరించారు. శ్రీకాకుళం టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది వద్ద గుర్తించిన లెక్కల్లోకి రాని నగదుపై అధికారులు విచారణ జరుపుతున్నారు.


విశాఖలో నేడు క్షేత్రస్థాయి పరిశీలన

గాజువాక, పెందుర్తి, మధురవాడ జోన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందాయి. గడువు తర్వాత నిర్మించిన భవనాలతోపాటు ఇప్పుడు నిర్మాణంలో ఉన్న భవనాలనూ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుంటున్నట్టు గుర్తించినట్టు తెలిసింది. సోదాల్లో దొరికిన సమాచారంతో క్షేత్రస్థాయికి వెళ్లి బుధవారం నిర్ధారించుకోనుంది.

ఫోన్‌పే లావాదేవీలపై విచారణ

ఒంగోలు కార్పొరేషన్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగం సిబ్బంది నుంచి రూ.25 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సిబ్బంది ఫో న్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని, లా వాదేవీలపై విచారణ చేపట్టారు. రాజమహేంద్రవరం టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పెండింగ్‌ ఫైల్స్‌ పుటప్‌ చేసే ఆపరేటర్‌ వద్ద రూ.2 వేలు స్వాధీ నం చేసుకున్నట్టు తెలిసింది. నెల్లూరు కార్పొరేష న్‌ కార్యాలయానికి వారిని కూడా క్షుణ్ణంగా ప్ర శ్నించి.. వారు చెప్పింది అధికారికంగా రికార్డు చేశారు.

Updated Date - Mar 11 , 2026 | 04:14 AM