Share News

శాంతి కేసులో కడప లింకులు!

ABN , Publish Date - May 24 , 2026 | 05:15 AM

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి జైలుకు వెళ్లిన దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి కడపకు చెం దిన వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు ఉన్న ట్టు ఏసీబీ విచారణలో బయటపడింది.

శాంతి కేసులో కడప లింకులు!

  • కడప వ్యక్తుల నుంచి ఆమె ఖాతాల్లోకి భారీ మొత్తాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి జైలుకు వెళ్లిన దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి కడపకు చెం దిన వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు ఉన్న ట్టు ఏసీబీ విచారణలో బయటపడింది. కడపకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఆమె బ్యాంకు ఖాతాల్లో దఫదఫాలుగా పెద్దమొత్తాలు జమ చేశారు. ఏసీబీ అధికారులు వారి గురించి శాంతిని ప్రశ్నించగా, వారెవరో తనకు తెలియదని బుకాయించారు. అధికారులు ప్రస్తావించిన పేర్లలో చిన్నంరెడ్డి ఈశ్వరరెడ్డి, వెంకట రవీంద్రరెడ్డి, కోటిరెడ్డి సింహాద్రి, కొప్పరపు ప్రవీణ్‌, కె.పెరుమాల్‌ తదితర పేర్లు ఉన్నాయి. గత నెల ఏడో తేదీన ఏసీబీ అధికారులు శాంతికి చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించి ఒక విల్లా, ఒక మండువా ఇల్లు, విశాఖలో ఫ్లాట్‌కు సంబంధించిన పత్రాలతో పాటు 700.19 గ్రాముల బంగారం, 2.963 కిలోల వెండి, బ్యాం కు లాకర్‌ తాళాలు కనుగొన్న సంగతి తెలిసిందే. ఆ రోజే అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తరువాత కోర్టు అనుమతితో రెండుసార్లు కస్టడీకి తీసుకున్నారు. ఆ సమయంలో 75కు పైగా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. వాటిలో కొన్నింటికే ఆమె సమాధానం చెప్పారు. ‘బేసిక్‌ పే ఎంత? విజయవాడలో సస్పెండ్‌ అయినప్పుడు జీతం ఎంత?’ అని అధికారులు అడిగితే మాత్రం ‘గుర్తులేదు’ అంటూ జవాబు ఇచ్చారు. జీతం కాకుండా ఇతర ఆదాయాలు ఏమై నా ఉన్నాయా?...అని అడిగితే, తాడేపల్లిలో ని కుంచనపల్లిలో గ్రౌండ్‌+2 విల్లాకు నెలకు రూ.లక్ష అద్దె వస్తుందని వెల్లడించా రు. దానిని రూ.95 లక్షలకు కొనుగోలు చేశానని, రూ.50 లక్షలు ఎస్‌బీఐ నుంచి రుణం, రమణారావు అనే వ్యక్తి నుంచి రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నానని పేర్కొన్నారు. స్థిరాస్తుల కొనుగోలుకు ప్రభుత్వ అనుమతి ఉందా అని ప్రశ్నించగా, ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు.


కానీ ఏసీబీ సోదాల సమయంలో మాత్రం ప్రభుత్వ అనుమతితోనే స్థిరాస్తులు కొన్నానని ఆమె చెప్పడం గమనార్హం. బంగారం గురించి ప్రశ్నించగా, పెళ్లి సమయంలో తల్లి 28 తులాలు, తండ్రి 15 తులాల బంగారం పెట్టారని వెల్లడించారు. విశాఖలో నడుముకు వడ్డాణం, మెడలో కాసులపేరు వేసుకొని తిరిగిన ఫొటోలు చూపించి, వాటి గురించి ప్రశ్నించగా, అవి వన్‌ గ్రాము బంగారమని, హైదరాబాద్‌లో కొన్నట్టు సమాధానం ఇచ్చారు. కాగా, లంచం సొమ్మును వైట్‌ చేసేందుకు, ఆ మొత్తాలను అప్పుగా తీసుకున్నానని చెప్పడం శాంతికి అలవాటేనని ఆమె మొదటి భర్త మదన్‌మోహన్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - May 24 , 2026 | 05:15 AM