మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:08 AM
మద్యం స్కాం కేసులో ఆరుగురు నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను ఈ నెల 25 వరకూ పొడిగించింది.
విజయవాడ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): మద్యం స్కాం కేసులో ఆరుగురు నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను ఈ నెల 25 వరకూ పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అనిల్ చోక్రా, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వాసుదేవరెడ్డి, కట్టా ప్రణయ్ ప్రకాశ్, రోణక్ కుమార్, ముప్పిడి అవినాశ్ రెడ్డిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.
మూడు రోజుల కస్టడీకి అవినాశ్‌రెడ్డి
మద్యం కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డిని మూడు రోజులపాటు కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 16 నుంచి 18 వరకు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.