దేవదాయ శాఖ ఏసీ శాంతి అరెస్టు
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:04 AM
దేవదాయ శాఖలో వివాదాస్పద మహిళా అధికారి కలింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.
అక్రమాస్తుల కేసులో ఏసీబీ కేసు నమోదు
అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖలో వివాదాస్పద మహిళా అధికారి కలింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం శాంతిపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆమెపై ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ప్యాలె్‌సకు సమీపంలో ఉన్న ఆ మె ఇంట్లో సోదాలు చేపట్టారు. ఇదే జిల్లాలోని ఉండవల్లిలోను, విశాఖ జిల్లా ఎండాడలోను తనిఖీలు కొనసాగాయి. ఈక్రమంలో ఏసీబీ అధికారులు భారీగా స్థిర, చరాస్తులు గుర్తించారు. విశాఖపట్నంలో పనిచేసిన స మయంలో అక్కడ సంపాదించిన త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్, తాడేపల్లిలో మూడంతస్తుల భవనం, సుమారు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు కిలోలకు పైగా వెండి వస్తువులు, రూ.1.15లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.3లక్షలు, వోక్స్ వాగన్ కారు, ద్విచక్ర వాహనం, ఖరీదైన ఎలకా్ట్రనిక్ వస్తువులు, ఇతర గృహోపకరణాలు ఈ సోదాల్లో బయట పడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 2020లో ఏపీపీఎ్‌ససీ ద్వారా దేవదా య శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా శాంతి చేరారు. ఆమె విశాఖపట్నంలో పనిచేస్తున్న సమయంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సహకారం తో భారీగా ఆస్తులు పోగేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమె విజయవాడలో కొంత కాలం పనిచేశారు. రాష్ట్రంలో కూ టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణ జరిపించి జూలై 2024లో శాంతిని స స్పెండ్ చేసింది. కేవలం నాలుగేళ్ల సర్వీసులో నే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆ మెపై మాజీ భర్త ప్రభుత్వానికి, దర్యాప్తు సం స్థలకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, ఇ టీవలే ఆమెపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇచ్చింది. ఇంతలోనే ఏసీబీ అధికారులు ఏకకాలంలో మూడుచో ట్ల సోదాలకు ది గారన్న వార్తలు మంగళవారం కలకలం సృష్టించాయి. సాయంత్రం వరకూ సోదాలు చేపట్టిన అధికారులు ఆమెను అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.
అడ్డగోలు అవినీతి పర్వం..
నంద్యాలకు చెందిన శాంతి 2020 జనవరిలో అసిస్టెంట్ కమిషనర్‌గా పోస్టింగ్ తీసుకున్నారు. చిన్న సూట్‌కేసుతో విశాఖకు వచ్చిన ఆమె దేవదాయ శాఖకు చెందిన సత్రంలో కొన్నాళ్లు బస చేశారు. ఆ తరువాత అక్కయ్యపాలెంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రెండున్నరేళ్లే విశాఖలో పనిచేశారు. కానీ, వైసీపీకి చెందిన ఒక నేత ఆశీర్వాదంతో అనతికాలంలో ఆ శాఖలో చక్రం తిప్పే స్థాయికి చేరారు. అసిస్టెంట్ కమిషనర్ పోస్టుతో పాటు అధిక ఆదాయం వచ్చే విశాఖ సంపత్ వినాయక ఆలయం ఈవోగా, ఎర్నిమాంబ ఆలయ ఈవోగా, ఆ తరువాత కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవోగా పనిచేశారు. జిల్లాల విభజన జరిగిన తరువాత ఎక్కువ దేవదాయ భూములు కలిగిన అనకాపల్లి జిల్లాకు కూడా తానే ఏసీగా అదనపు బాధ్యతలు ఉంచుకున్నారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తికాక ముందే విశాఖలోని విశాలాక్షినగర్‌లోని సాయి వింటేజ్ అపార్టుమెంట్‌లో త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొన్నారు. ఆ తరువాత బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. ఆమెను మదన్‌మోహన్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నారు. ఏపీపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఆమెకు ఆయన ఆర్థిక సాయం కూడా చేశారు. ఇదీ శాంతి కుటుంబ పరిస్థితి. ఇదిలాఉండగా, వైసీపీ అధినాయకత్వం 2022లో ఇక్కడ ఒక నేతను బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో శాంతి కూడా బదిలీ చేయించుకుని విజయవాడకు వెళ్లిపోయారు. అక్కడ కూడా కీలకమైన పోస్టింగ్‌లు సాధించుకున్నారు. కుంచనపల్లిలోని బ్రూక్‌ఫీల్డ్‌లో రూ.4 కోట్లకు విల్లాను కొనుగోలు చేశారు. దానికి అవసరమైన డబ్బుల కోసం అమెరికాలో ఉన్న భర్త మదన్‌మోహన్‌ను 2022 సెప్టెంబరులో ఇండియాకు రప్పించారు. ఆమె, ఆయన కలిసి సెప్టెంబరు 20న విశాఖపట్నంలో ఒక బిల్డర్ ఇంటికి వెళ్లి కోటి రూపాయల నగదు కలిగిన బ్యాగ్ తీసుకున్నారు. ఆ తరువాత భర్తను హైదరాబాద్‌లో వైసీపీ నేత ఇంటికి పంపించి రూ.60 లక్షల నగదు తెప్పించారు. విశాఖలో ఉన్నప్పుడు శాంతికి న్యాయవాది సుభాశ్‌రెడ్డితో పరిచయం ఏర్పడి, అది పెళ్లి వరకు దారితీసింది. తనకు విశాఖలో జన్మించిన మగబిడ్డకు ఆయనే తండ్రి అని ఆమె మీడియా ముఖంగానే ప్రకటించారు. అదే సుభాశ్‌రెడ్డితో కలిసి విజయవాడలో స్థలం కొని అందులో విల్లా నిర్మించారు. ప్రస్తుతం ఆమె అందులోనే నివసిస్తున్నారు. ఆ విల్లాకు సంబంధించిన ఆస్తి పత్రాల్లో ఆమె న్యాయవాద వృత్తిలో నల్లకోటు వేసుకొని తీసుకున్న ఫొటోను పెట్టి రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం తల్లి ఈశ్వరమ్మ పేరుతో విజయవాడలో ఒక బొటిక్ నడుపుతున్నారు. అదనపు ఆదాయం చూపించడానికి ఈ ఏర్పాటు చేసుకున్నారని దేవదాయ వర్గాలు చెబుతున్నాయి.