Share News

విద్యుదుత్పాదనకు పుష్కలంగా నీటి నిల్వలు

ABN , Publish Date - May 25 , 2026 | 11:53 PM

సీలేరు కాంప్లెక్సు పరిధిలో విద్యుదుత్పాదనకు అవసరమైన నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, నీటి సమస్య లేదని జలవిద్యుత్‌ కేంద్రం జెన్‌కో ఈఈ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

విద్యుదుత్పాదనకు పుష్కలంగా నీటి నిల్వలు
మాట్లాడుతున్న రాజేంద్రప్రసాద్‌

రోజుకు రెండు మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి

సీలేరు జల విద్యుత్‌ కేంద్రం జెన్‌కో ఈఈ రాజేంద్రప్రసాద్‌

సీలేరు, మే 25 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలో విద్యుదుత్పాదనకు అవసరమైన నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, నీటి సమస్య లేదని జలవిద్యుత్‌ కేంద్రం జెన్‌కో ఈఈ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో రోజుకు రెండు మిలియన్‌ యూనిట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. జల విద్యుత్‌ కేంద్రంలో 60 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్లు అందుబాటులో ఉన్నా యన్నారు. ఈ ఏడాది సీలేరు జల విద్యుత్‌ కేంద్రం ఉత్పత్తి లక్ష్యం 471 మిలియన్‌ యూనిట్లుగా సెంట్రల్‌ విద్యుత్‌ అథారిటీ నిర్ణయించిందని, ఈ లక్ష్యాన్ని నిర్దేశించిన సమయానికన్నా ముందే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి మే 24 వరకు 94 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేశామని ఆయన తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 11:53 PM