కోర్టు ఉద్యోగాల పరీక్ష రద్దు
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:31 PM
స్థానిక న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కోర్టు ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కర్నూలు లీగల్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): స్థానిక న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కోర్టు ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రికార్డు అసిస్టెంట్, ప్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల కోసం గత ఫిబ్రవరి 18న స్థానిక ప్రసూన లా కాలేజీలో రాత పరీక్షను నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పరీక్షను రద్దుచేసి మళ్లీ రాత పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఈ రాత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుని పీజులు చెల్లించిన అభ్యర్థులు తిరిగి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు. పూర్తి వివరాలు త్వరలో జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని వెల్లడించారు.