నేటి నుంచి పాత సమయానికే అష్టదళపాద పద్మారాధన
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:03 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో వారపు సేవగా ఉన్న అష్టదళపాదపద్మారాధన పూర్వపు సమయంలోనే నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.
తిరుమల, మార్చి 9(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో వారపు సేవగా ఉన్న అష్టదళపాదపద్మారాధన పూర్వపు సమయంలోనే నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. 2022 వరకు ఉదయం 6 నుంచి 6.45 గంట ల వరకు జరిగే ఈ సేవను వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉదయం 9 నుంచి 9.45 గంటల వరకు నిర్వహించేలా మార్చారు. వేకువజామునే వరుసగా సేవలన్నీ పూర్తి చేస్తే తర్వాత సాధారణ దర్శనాలను యథావిధిగా కొనసాగించవచ్చని ప్రస్తుత టీటీడీ బోర్డు, అధికారులు పాత సమయానికే అష్టదళపాదపద్మారాధనను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి అమలు కానుంది.