వైభవంగా మల్లన్నకు ఆరుద్రోత్సవం
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:59 PM
శ్రీశైల క్షేత్రంలో మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి.
వేదమంత్రాలతో మార్మోగిన లింగోద్భవ ఘడియలు
నేడు నంది వాహనంపై దర్శనం ఇవ్వనున్న స్వామి, అమ్మవార్లు
శ్రీశైలం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల క్షేత్రంలో మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. శుక్రవారం రాత్రి 10 గంటలకు గణపతిపూజ, లోకకళ్యాణ ఉత్సవ మహా సంకల్పాన్ని వేదపండితులు పఠించారు. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షతం రోజున వార్షికో త్సవం జరిపించడం సాంప్రదాయమని ఈవో శ్రీనివాసరావు చె ప్పారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుండి సుప్రభాతసేవ, ప్రాత:కాల పూజలు అయ్యాక ఆలయ ముఖ మండప ఉత్తరద్వారాన్ని తెరచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఈవో తెలిపారు. స్వామి, అమ్మవార్లకు నందివాహన సేవ నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.