Share News

మహిళా పోలీస్‌ స్టేషన ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:44 PM

పట్టణంలో ప్రత్యేక మహిళా పోలీస్‌ స్టేషన ఏర్పాటు చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు శశిధర్‌, కార్యదర్శి సంజయ్‌ కోరారు.

  మహిళా పోలీస్‌ స్టేషన ఏర్పాటు చేయాలి
ఏఎస్పీ జయ శర్మకు పూలమొక్కను అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ఆదోని అగ్రికల్చర్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి) : పట్టణంలో ప్రత్యేక మహిళా పోలీస్‌ స్టేషన ఏర్పాటు చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు శశిధర్‌, కార్యదర్శి సంజయ్‌ కోరారు. అడిషనల్‌ ఎస్‌పీగా బాధ్యతలు చేపట్టిన జయ శర్మను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆలూ రు, మంత్రాలయం నియోజవకర్గాల నుంచి ఫిర్యాదు చేయడానికి కర్నూలు వెళ్లాలంటే 150 కిలోమీటర్ల పైగా ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. సరైనా రవాణా సౌకర్యం లేక మహిళలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆదోనిలోనే మహిళా పోలీస్‌ స్టేషన ఏర్పాటు చేయాలన్నారు. గృహింస, లైంగిక వేధింపులు కుటుంబ సమస్యల, మహిళలు బాలిక భద్రతకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, గౌస్‌, చందన, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:44 PM