Share News

శ్వేతపత్రం విడుదల చేయాలి

ABN , Publish Date - Aug 17 , 2026 | 11:44 PM

పట్టణ పరిధిలో మురికి వాడల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చే యాలని సీపీఐ నాయకు లు డిమాండ్‌ చేశారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి
మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

ఆదోని టౌన, ఆ గస్టు 17(ఆంధ్రజ్యోతి) : పట్టణ పరిధిలో మురికి వాడల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చే యాలని సీపీఐ నాయకు లు డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఐ ఆధ్వ ర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి వీరేష్‌ మాట్లాడుతూ శివారు కాలనీల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నామన్నారు. ఆయా కాలనీల అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మునిసిపల్‌ కమిషనర్‌ నయీమ్‌ అహ్మ ద్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ సహాయ కార్య దర్శి రమేష్‌ కుమార్‌, కార్యవర్గ సభ్యులు విజయ్‌కుమార్‌, బాలకృష్ణ, డీ హెచపీఎ్‌స గౌరవ అధ్యక్షుడు ప్రకాష్‌, ఈరన్న, శేక్షావలి, ఓబీ నాగ రాజు, నబీసాబ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 11:44 PM