Share News

గాడి తప్పుతున్న బాల్యం

ABN , Publish Date - Apr 03 , 2026 | 10:43 PM

పుస్తకాలు చేత పట్టి బడికెళ్లాల్సిన బాల్యం గాడి తప్పింది. పసిప్రాయంలోనే చాకచక్యంతో ఆ పిల్లలు చేసే చోరీలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యానికి గురికాకతప్పదు.

   గాడి తప్పుతున్న బాల్యం
షెట్టర్‌ తెరచి దుకాణంలోకి ప్రవేశించిన చిన్నారులు

చిన్న వయస్సులోనే దొంగతనాలు

ఆత్మకూరులో ఆశ్చర్యం గొలిపేలా చోరీ ఘటన

ఆత్మకూరు, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): పుస్తకాలు చేత పట్టి బడికెళ్లాల్సిన బాల్యం గాడి తప్పింది. పసిప్రాయంలోనే చాకచక్యంతో ఆ పిల్లలు చేసే చోరీలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యానికి గురికాకతప్పదు. ఆత్మకూరులోని సంతమార్కెట్‌లోని కూరగాయల దుకాణాల్లో రెండు, మూడు రోజు లుగా చిన్నపాటి దొంగతనాలు చోటుచేసుకున్నాయి. తొలుత ఈ దొం గతనాలను వ్యాపారులు సీరియస్‌గా పరిగణించలేదు. ఎవరైనా ఆకతాయిలు ఇలాంటి పనులకు పాల్పడ్డారా..? అని అనుమానించారు. కానీ అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. బడికి వెళ్లే ముగ్గురు విద్యార్థులే ఈ చోరీ చేసినట్లు గుర్తించి వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. సంతమార్కెట్‌లోని కూర గాయల దుకాణాలకు తాళాలు కూడా వేయరు. తడికెలను, షెట్టర్లను అడ్డంగా కట్టేస్తారు. ఇదే అదునుగా ముగ్గురు పిల్లలు స్కూల్‌ యూని ఫామ్‌ ధరించి మరీ సంతమార్కెట్‌లోని దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఈక్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో ఆ ముగ్గురు పిల్లలు సంతమార్కెట్‌లోని వెళ్లి దుకాణాల షట్టర్లు, తడికెలను ఎత్తి అందులోకి ప్రవేశించారు. అక్కడ రెండు టేబుల్‌ కౌంటర్ల ట్రాయర్లను తెరిచారు. అందులో ఒక దాంట్లో రూ.1,200, మరో దాంట్లో రూ.800 చొప్పున ఎత్తుకెళ్లారు. ఈ చోరీ దృ శ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ పిల్లల్ని చూసిన వారందరు ఆశ్చర్యానికి లోనయ్యారు. వీరు ప్రవేశించిన దుకాణాల్లో సీసీ కెమెరాలు ఉండటాన్ని గమనించిన ఈ చిన్నారులు వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో ఆత్మకూరు పట్టణంలో వైరల్‌గా మారడంతో ఈచోరీ ఘటన చర్చనీ యాంశంగా మారింది. అయితే ఈ చిన్నారులు ఎవరి ప్రోద్బ లంతోనైనా ఈ దొంగతనాలకు పాల్పడ్డారా..? లేదా వారిలోనే ఇలాంటి అసాంఘికమైన స్పృహ కలిగిందా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. ఆపిల్లలను గుర్తించి వారికి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Apr 03 , 2026 | 10:43 PM