Share News

నిబద్ధతకు నిదర్శనం

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:43 PM

కార్యకర్తే అధినేత.. అనే మాటకు ఉలిగయ్యకు దక్కిన పదవే నిదర్శనమని టీడీపీ నాయకు లు అన్నారు.

నిబద్ధతకు నిదర్శనం

టీడీపీ నాయకులు

జడ్పీ చైర్మన్‌ ఉలిగయ్యకు ఘన సన్మానం

ఆదోని, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తే అధినేత.. అనే మాటకు ఉలిగయ్యకు దక్కిన పదవే నిదర్శనమని టీడీపీ నాయకు లు అన్నారు. కర్నూలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికైన ఉలి గయ్యను ఆదోని పట్టణంలోని మారుతినాయుడు కార్యాలయంలో టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి భూపాల్‌చౌదరి, తెలుగు యువత నాయకులు మారుతినాయుడు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి వెంకటేష్‌చౌదరి సత్కరించారు. ఈ సందర్భంగా భూపాల్‌చౌదరి మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు నాయకత్వంలో చూడి ఉలిగయ్య ఎన్నో ఏళ్లగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అటుపోట్లను ఎదుర్కొని, ఆస్తులు కోల్పోయినా జెండాను వీడకుండా పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమిం చారన్నారు. అటువంటి నిబద్ధత కలిగిన కార్యకర్తకు జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తే అధినేత.. అనే మాటకు ఉలిగయ్యకు దక్కిన ఈ పదవే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఆదోని టీడీపీ పట్టణ అధ్యక్షుడు, 48వ వార్డు కౌన్సిలర్‌ వాల్మీకి తిమ్మప్ప, కౌన్సిలర్లు జయరాం, రవి, ముజీబ్‌అహమ్మద్‌, కౌతాళం మండలాధ్యక్షుడు సురేష్‌నాయుడు, నాయకులు సతీష్‌నాయుడు, కొంక రామకృష్ణ, వినయ్‌, జేపీ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 11:43 PM