Share News

రీ సర్వేలో తప్పుల తడక

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:51 PM

రైతుల సమస్యలు పరిష్కరిం చేం దుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వేలు అధికా రుల నిర్లక్ష్యంతో రైతుల భూముల్లో తేడాలు వచ్చా యి.

రీ సర్వేలో తప్పుల తడక
అధికారులు, నాయకులను ప్రశ్నిస్తున్న రైతులు

- పాసు పుస్తకాలను తిరస్కరించిన రైతులు

హాలహర్వి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యలు పరిష్కరిం చేం దుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వేలు అధికా రుల నిర్లక్ష్యంతో రైతుల భూముల్లో తేడాలు వచ్చా యి. ఈ పాసు పుస్తకాలు మాకొద్దంటూ రైతులు తిరస్కరించారు. ఈ సం ఘటన హాలహర్వి మం డలంలోని కొక్కరచేడు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా రీ సర్వే పూర్తికావడంతో గ్రామాల్లో పాసు పుస్తకాల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. నాయకుల సమక్షంలో అధికారులు పంపిణీ చేసేందుకు రాగా పాసు పుస్తకాలను పరిశీలించిన రైతులు అసహనం వ్యక్తం చేశారు. తమ వారసత్వ భూముల్లో దాదాపు రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు విస్తీర్ణం తగ్గిందని ఆరోపించారు. కొలతల సక్రమంగా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో టీడీపీ నాయకులు రైతుల సమస్యలను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. తప్పుల తడక ఉన్న ఈ పాస్‌ పుస్తకాలు మేము సైతం పంపిణీ చేయబోమని, మీ సమస్యను తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని మండల కన్వీనర్‌ శ్రీధర్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు సుధాకర్‌ భరోసా ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ విషయాన్ని తహసీల్దార్‌ ఓంకార్‌ప్ర సాద్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆ గ్రామానికి సంబంధించిన వీఆర్వో, విలేజ్‌ సర్వేయర్‌తో చర్చించి రైతుల సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:51 PM