పనిమనిషే దొంగ
ABN , Publish Date - May 02 , 2026 | 10:54 PM
నాలుగో పట్టణ పోలీస్ స్టేషన పరిధిలో వివేక్‌నగర్‌లో ఉంటున్న సత్యమూర్తి నాగేంద్ర అనే ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు.
15 తులాల బంగారు నగలు స్వాధీనం
కర్నూలు క్రైం, మే 2 (ఆంధ్రజ్యోతి): నాలుగో పట్టణ పోలీస్ స్టేషన పరిధిలో వివేక్‌నగర్‌లో ఉంటున్న సత్యమూర్తి నాగేంద్ర అనే ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఆ ఇంట్లో పని మనిషే నిందితురాలుగా గుర్తించారు. సత్యమూర్తి నాగేంద్ర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు ఇద్దరు కొడుకులు సంతానం కాగా వృత్తిరీత్యా దూరంగా ఉంటారు. ఆయన భార్యకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పాతబస్తికి చెందిన పర్వీన అనే మహిళను పనిమనిషిగా పెట్టుకున్నారు. ఏప్రిల్ 21 నుంచి 24వ తేదీ మద్యకాలంలో సుమారు 15 తులాల బంగారు నగలు, 30 తులాల వెండి నగలు కనిపించకుండా పోయాయి. దీంతో గుర్తించిన సత్యమూర్తి నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పనిమనిషిని విచారిస్తే తానే దొంగతనం చేసినట్లుగా ఒప్పుకుంది. ఆమె నుంచి 15 తులాల బంగారు నగలు, 30 తులాల వెండి నగలు రికవరీ చేశారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. ఈ కేసులో చురుగ్గా పని చేసిన ఎస్‌ఐలు గోపీనాథ్, చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్ జీనస్, కానిస్టేబుళ్లు మురళి, సుబ్బరాయుడును అభినందించారు.