చిచ్చు పెట్టిన రికార్డింగ్ డ్యాన్స..
ABN , Publish Date - Apr 24 , 2026 | 10:40 PM
తిరునాలలో జరిగిన రికార్డింగ్ డ్యాన్స గ్రామంలో చిచ్చు పెట్టింది. ఈఘర్షణలో ఓయువకుడు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలి పారు.
యువకుడి దారుణ హత్య
మృతుడికి వివాహమై 45 రోజులే
నిందితుడి ఇంటి ఎదుట బంధువులు, కుటుంబీకుల ధర్నా
ఓర్వకల్లు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): తిరునాలలో జరిగిన రికార్డింగ్ డ్యాన్స గ్రామంలో చిచ్చు పెట్టింది. ఈఘర్షణలో ఓయువకుడు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలి పారు. వివరాలు.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి తిరుణాల సందర్భంగా శుక్రవారం తెల్లవా రుజామున ఆర్టీసీ బస్టాప్ వద్ద డీజే రికార్డింగ్ డ్యాన్స ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వడ్డె మనోజ్ కుమార్(22), ఎరుకలి వంశీ నృత్యం చేస్తూ ఘర్షణకు దిగారు. మనోజ్‌కుమార్‌ను గ్రామస్థులు, పోలీసులు సర్ధి చెప్పి ఇంటికి పంపించారు. ఈ ఘర్షణ విషయాన్ని ఎరుకలి వంశీ తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో అతడి తల్లి వెంకటలక్ష్మి, తండ్రి శ్రీరాములు, చిన్నాన్న లక్ష్మీనారాయణ, రేణుక విద్యుత సరఫరాను నిలిపివేసి మనోజ్‌కుమార్ ఇంటిపై దాడికి వెళ్లారు. అక్కడ మాటామాట పెరిగి వంశీ తన వద్ద ఉన్న కత్తితో మనోజ్‌కుమార్ గొంతుపై దాడి చేయగా తీవ్ర రక్తగాయాలై అతడు కిందపడిపోయాడు. దాడికి వచ్చిన వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. మనోజ్‌కుమార్‌ను కుటుంబీకులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఎరుకలి వంశీపై దాడి చేసేందుకు మృతుడి బంధువులు వెళ్లగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనోజ్‌కుమార్, వంశీకి కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు, ఎస్‌ఐలు సునీల్‌కుమార్, ధనుంజయ, అకిల్‌కుమార్ గ్రామానికి చేరుకొని ఘటనాస్థలిని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.
శోకసంద్రంలో కుటుంబీకులు
మృతుడు మనోజ్‌కుమార్‌కి 45 రోజుల క్రితమే చింతలపల్లె గ్రామానికి చెందిన వెంకటేశ్వ రమ్మతో వివాహమైంది. భర్త మృతితో భార్య, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడు కొంతకాలంగా కర్నూలులోని జంపాలశివయ్య నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తిరునాల సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి వచ్చాడు.
ఇంటి ముందే శవాన్ని పూడుస్తామని..
మనోజ్‌కుమార్‌ను హత్య చేసిన ఎరుకలి వంశీ ఇంటి ఎదుట మనోజ్ మృతదేహంతో బం ధువులు, కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. ఇంటిముందే శవాన్ని పూడుస్తామని పోలీ సులకు తేల్చి చెప్పారు. వంశీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పో షించారంటూ భారీఎత్తున నినాదాలు చేశారు. ఇంట్లో చొరబడేందుకు భారీ సంఖ్యలో ప్రయ త్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని రూరల్ సీఐ చంద్రబాబునాయుడు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించి మనోజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు
ఐదు మందిపై కేసు నమోదు
వడ్డె మనోజ్ కుమార్ హత్య కేసులో ఐదు మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎరుకలి వంశీ, వెంకటలక్ష్మి, శ్రీరాములు, సత్యనారాయణ, రేణుకపై కేసు నమోదు చేశామని, వారిని త్వరగా అరెస్టు చేసి జైలుకు పంపుతామని పోలీసులు తెలిపారు.