వన భోజనం... ఓ దివ్య ఔషధం
ABN , Publish Date - Nov 26 , 2026 | 01:14 AM
ప్రకృతి సిద్ధమైన మూలికా క్షేత్రంగా పిలువబడే శ్రీశైల క్షేత్రంలో కార్తీక వన భోజనం ఓ దివ్య ఔషధమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు
శ్రీశైలం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి సిద్ధమైన మూలికా క్షేత్రంగా పిలువబడే శ్రీశైల క్షేత్రంలో కార్తీక వన భోజనం ఓ దివ్య ఔషధమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం క్షేత్ర పరిధిలోని రుద్రవనంలో దేవస్థానం అధికారులు సిబ్బంది కుటుంబసభ్యులతో కలిసి సామూహిక కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించింది. ట్రస్ట్ బోర్డు చైర్మన పోతుగుంట రమేశనాయుడు ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో ముఖ్య అతిథిగా హాజరై ఉసిరి వృక్షానికి సంప్రదాయ పూజలను శాస్త్రోక్తంగా చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్లమల అటవి అందాలు ఎత్తైన కొండలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆస్వాదించే వన భోజన అన్న ప్రసాదం ఔషధంలా పని చేస్తుందని అన్నారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది కుటుంబసభ్యులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ట్రస్ట్‌బోర్డు చైర్యన మాట్లాడుతూ నిత్యం భక్తుల సేవలో నిమగ్నమై ఉండే అధికారులు, సిబ్బంది కుటుంబాలతో కలిసి వన భోజనం చెయ్యడం వల్ల మానసికోల్లాసం పొందుతారని అన్నారు. ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 20 రకాలైన వంటలతో 3000 మందికిపైగా సామూహిక వనభోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వనభోజన కార్యక్రమంలో శ్రీశైలం ఇనచార్జి యుగంధర్ రెడ్డి, క్లస్టర్ ఇనచార్జి రమణ, సున్నిపెంట సర్పంచ వెంకటరెడ్డి, శ్రీశైల మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరు మెడికల్ సుబ్బయ్య, ఇనచార్జి డీఈ సీతా రమేశ, చంద్రశేఖర శాసి్త్ర, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ సహాయ ఎడిటర్ గణేష్ తదితరులు ఉన్నారు. వనభోజన విశిష్టతపై తెనాలికి చెందిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి ప్రసంగించారు. నందికొట్కూరుకు చెందిన లిక్షితాశ్రీ నృత్య కళాశాల బృందం చేసిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి.