సాయిప్రసాద్‌రెడ్డి అండతోనే భారీ కుంభకోణం
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:36 PM
మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అండతోనే రూ.128కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపిం చారు.
ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి
ఆదోని, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అండతోనే రూ.128కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపిం చారు. గురువార పట్టణ పొలిమేరలోని జనగన్న కాలనీని సందర్శించి అక్కడి అసంపూర్తి నిర్మాణాలను, నాసిరకం పనులను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద హౌసింగ్ స్కామ్ ఆదోని వేదికగా జరిగిందన్నారు. గత ప్రభుత్వ పెద్దలు పేదల సొంతింటి కలను పెట్టుబడిగా మార్చుకొని రూ.128 కోట్ల మేర భారీ దోపిడీకి పాల్పడ్డారన్నారు. కాలనీలో 5వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, లబ్ధిదారులను ప్రలోభపెట్టి మాజీఎమ్మెల్యే అనుచరులే కాంట్రాక్టర్ల అవతా రమెత్తారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇచ్చే రూ.1.80లక్షల నగదును సైతం లబ్ధిదారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్లే డ్రా చేసుకున్నారన్నారు. ఈ అక్రమాలపై ఇప్పటికే సీఎంతో పాటు సంబంధిత మంత్రులకు నివేదించామని, త్వరలోనే విచారణ ప్రారంభమవుతుందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు.