వైభవంగా లక్ష దీపోత్సవం
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:37 PM
మహాశివరాత్రి పర్వదిన పురస్కరించుకొని పట్టణంలోని శంభులింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం శివభక్తులు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆదోని టౌన, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : మహాశివరాత్రి పర్వదిన పురస్కరించుకొని పట్టణంలోని శంభులింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం శివభక్తులు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా గురుస్వామి శైలేంద్ర నాథ్ స్వా మి దంపతులు జ్యోతిర్లింగ పడిపూజ నిర్వహించి శంభు లింగేశ్వర స్వా మికి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రత్యేక పూజలలో పాల్గొన్న శివయ్య భక్తులు శివలింగ ఆకారంలో ఏర్పాటు చేసిన లక్ష దీపాలను వెలిగించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.