Share News

తాగునీరు అందించలేని ప్రభుత్వం

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:01 AM

ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే విరుపాక్షి అ న్నారు.

తాగునీరు అందించలేని ప్రభుత్వం
నిరసన తెలుపుతున్న మహిళలకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యే విరుపాక్షి

ఆలూరు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే విరుపాక్షి అ న్నారు. పట్టణంలో 20 రోజులు గడిచినా తాగునీరు సరఫరా కాకపోవడంతో మంగళవారం మహిళలు గ్రామ పంచాయతీ కార్యాల యం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. వీరికి మద్దతు పలికి బైఠాయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 20 రోజులుగా నీరు సరఫరా కాకపోతే ప్రజలు ఎలా దాహం తీర్చుకోవాలన్నారు. అస లు ప్రభుత్వం ఉందా లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. అనంతరం ఎంపీడీవో మద్దిలేటిస్వామికి వినతి పత్రం అందజేశారు. త్వరితగతిన తాగునీటి సమస్యకు పరిష్కా రం చూపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మల్లికార్జున, భాస్కర్‌నాయుడు, జీరాగౌడ్‌, వెంకటేశ్వర్లు, వరుణ్‌, ఈరన్న, జాన్‌, మరకట్టు ఎల్లప్ప, దానాల రాజు పాల్గొన్నారు.

15 రోజులుగా తాగునీరు అందడం లేదు

మద్దికెర: 15 రోజులుగా తాగునీరు వదలకపోతే ఎలా అని గ్రామస్థులు ప్రశ్నించారు. మంగళవారం మద్దికెర గ్రామంలోని గి డ్డయ్యవీధి, మెయిన బజార్‌, ఉప్పరివీధి చెందిన మహిళలు పం చాయతీ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ ఎంపీడీవో విజయలక్ష్మితో వాగ్వాదానికి దిగారు. తమ వీధులకు పంచాయతీ సిబ్బంది సక్రమంగా తాగునీరు వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ ఎంపీడీవో విజయలక్ష్మి సముదాయిం చారు. కార్యక్రమంలో మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 12:01 AM